ఖమ్మం జిల్లాలో సీఎం రెండోరోజు ఇందిరమ్మబాట
ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోరోజు పర్యటించనున్నరు. బుధవారం మొదటిరోజు పర్యటన అనంతరం సున్నంవారిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో రాత్రి బస చేశారు. ఈరోజు ఇందిరమ్మబాటలో భాగంగా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం రాజీవ్ యువకిరణాల లబ్ధిదారులతో పాల్వంచలోని నవభారత్ కళాశాలలో సమావేశం నిర్వహిస్తారు.