గంజాయి తోటలపై దాడులు
రేగోండ : వరంగల్ జిల్లా రేగోండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఏన్ఫోర్స్మెంట్ అదికారులు, ఎక్సైజ్ శాఖ పోలిసులు ఈ రోజు దాడులు నిర్వహించారు గ్రామానికి చెందిన గుల్ల నర్సయ్య గుల్ల బిక్షపతి అనే ఇద్దరు రైతులు తమ పంట చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న సమాచారమందుకున్న అదికారులు పంటలను పరీశీలించారు.అక్కడ ఉన్న దాదాపు 11 వందల గంజాయి మొక్కలను తగులబెట్టారు. వీటి విలువ మార్కెట్లో ఐదు లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందుతులు పరారీలో ఉండటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.