గణనాథుని సన్నిధిలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 2 : మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం దగ్గర శుక్రవారం ఆర్యవైశ్యు నాయకులు లక్ష్మయ్యశెట్టి, బాలచందర్ శెట్టి, బాదం బీచుపల్లయ్య శెట్టి, సత్యనారాయణ శెట్టి, సురేష్ శెట్టి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ జోగుల రవి, ఇటిక్యాల ఎస్సై గోకారి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టడం పై వారు అభినందించారు. అన్నదానం మధ్యాహ్నము నుంచి సాయంత్రం వరకు సుమారు 2000 మంది భక్తులకు అన్నదానం చేసినట్లు ఆర్యవైశ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ శెట్టి రాజయ్యశెట్టి, వజ్రాల నరసింహశెట్టి, శంకర్ శెట్టి భాస్కర్ శెట్టి, ప్రకాష్ శెట్టి, శేషుపాణిశెట్టి తోపాటు ఆయా గ్రామాల ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.