గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో అవ్వ తాతల దినోత్సవం

గరిడేపల్లి, సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మన ఉన్నతికి కారణం అయిన అవ్వ తాతలను వృధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ పిల్లలను పెద్దలను కోరారు. గురువారం గరిడేపల్లి మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రం లో ఘనంగా అవ్వా తాతల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం వృధాప్యంలో వారికి సేవ చేయడం  మన సంప్రదాయం అని దానిని కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని ఆమె అన్నారు.ఈ సందర్బంగా పిల్లలు అవ్వా తాతలకు కాళ్ళు కడిగి పాదాభివందనం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పోకల వెంకమ్మ, అమరావరపు సత్యవతి, ఆయా గోవిందమ్మ, అవ్వలు, తాతలు, గ్రామ పెద్దలు,పిల్లలు పాల్గొన్నారు.