గిరిజన సంక్షేమం కోసం తెరాస కృషి

ఎమ్మెల్యే కంచర్ల
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
గిరిజన సంక్షేమ కోసం తెరాస ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్రనాయక్ లు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో గిరిజన అభివృద్ధి సంస్థ నూతన భవన శంకుస్థాపన చేసిన అనంతరం కంచర్ల మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిందని, ప్రతి తండాను గ్రామపంచాయతీ చేసిందని,
గిరిజన రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
గిరిజన అందరూ తమ హక్కుల కోసం ఐక్యంగా కలిసి ఉండి సాధించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రు నాయక్ తో పాటు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,ప్రవీణ్ నాయక్, హేమ నాయక్, అమర్ సింగ్ కోనేటి నరసింహరుద్రాక్ష వెంకన్న, కౌన్సిలర్లు పున్నా గణేష్ ప్రదీప్ నాయక్, ఖయ్యుమ్ బేగ్ సమీ యొద్దీన్,బోయినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు