గీతదాటిన పాక్‌ బలగాలు భారత సైనికులపై కాల్పులు ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ, కాశ్మీర్‌ : భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైనికులు దారుణానికి తెగపడ్డారు. ఆదీన రేఖ వద్ద ఉన్న ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపారు. సైనికులు కూడా పాకిస్థాన్‌ సైన్యం దాడిని అంతేస్థాయిలో ప్రతిఘటించారు. వీరోచితంగా కాల్పులు జరుపుతూ ప్రాణాలు కోల్పోయారు. భారత్‌, పాకిస్థాన్‌ సరిహదుల్లో ఇటీవల పాక్‌ సైనికులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది.