న్యాయస్థానంలో అవినీతి సిబ్బంది

 

 

 

 

పట్టుకున్న ఏసీబీ అధికారులు
భూపాలపల్లిలో కలకలం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్స్ చేశారు. కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయిచరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోర్టు తీర్పు కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా, బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అధికారులు పట్టుకున్నారు. న్యాయస్థానంలో జరిగిన ఈ సంఘటన భూపాలపల్లిలో కలకలం రేపుతోంది