ప్రపంచ దేశాల ముందు పరువుపోయింది
` ఏఐ సమ్మిట్‌లో నవ్వులపాలైన యూపీకి గల్గోటియాస్ యూనివర్సిటీ
` చైనా రోబో మాదేనంటు తప్పుడు క్లైమ్
` సదస్సు నుంచి యూనివర్సిటీ గెంటివేత
న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహిస్తోంది. దానికి అంతర్జాతీయస్థాయి నేతలు, ప్రతినిధులు, టెక్ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని యూనివర్సిటీ నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. చైనా రోబోడాగ్ వివాదాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది జాతీయ విÖడియా కథనాల ప్రకారం..గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ దిల్లీలో జరుగుతోన్న ఏఐ సదస్సులో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రోబోడాగ్‌ను అభివద్ధి చేశామంటూ విద్యాసంస్థ ప్రతినిధులు దానిని ప్రదర్శించారు. దానికి ‘Oతీతినీని’ అని పేరుపెట్టి దాని పనితీరును విÖడియాకు వివరించారు. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అలాంటి రోబోడాగ్‌నే చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ అభివద్ధి చేసింది. యూనిట్రీ పేరిట విక్రయిస్తోంది. భారత్‌లోనూ ఆ విక్రయాలకు అనుమతి ఉంది. రూ.2లక్షలు నుంచి రూ.3లక్షలు పెట్టి ఆన్‌లైన్‌లో ఆ డాగ్‌ను కొనుక్కోవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశీ సాంకేతికతను భారత్ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు చేశారు.దీనిపై యూనివర్సిటీ వివరణ ఇచ్చుకుంది. దానిని చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నామని చెప్పింది. దానిని తామే అభివద్ధి చేశామని ఎన్నడూ చెప్పలేదని పేర్కొంది. భారత్‌లో అలాంటి ఉత్పత్తిని తీసుకొచ్చేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. కానీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వీడియోల్లో విద్యాసంస్థ ప్రతినిధులు దానిని తామే అభివద్ధి చేసినట్లు చెప్పుకోవడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. సదస్సులో నుంచి గల్గోటియాస్‌కు ఉద్వాసన పలికింది. దానికి కేటాయించిన స్టాల్‌ను అధికారులు ఖాళీ చేయించారు.అయితే రోబోడాగ్ వరకే ఈ వివాదం పరిమితం కాలేదు. దక్షిణకొరియా అభివద్ధి చేసిన సాకర్ డ్రోన్‌ను తమవద్దే అభివద్ధి చేశామని విద్యాసంస్థ ప్రతినిధులు చెప్పినట్లు విÖడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సాకర్ డ్రోన్ రిమోట్ కంట్రోల్‌తో నడుస్తుంది. డ్రోన్ చుట్టూ గుండ్రటి ఆకతి పంజరం మాదిరిగా ఉంటుంది. కాగా.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. సరైన ప్లానింగ్ లేకుండా ప్రచారం చేసుకుంటున్నారంటూ కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు.



