మానవ అభివద్ధిలో ఏఐ కీలకం

` ఏఐని మనమే శాసించాలి
` మన ఆలోచనలకు అందనంతగా ఎఐ
` మానవ అభివద్దిలో ఎఐది కీలక భూమిక
` భారత్‌లో ఎఐ పురోభివద్ది చరిత్రగా నిలుస్తుంది
` ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం మన ఆలోచనలకు అందనంత దూరంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఏఐ వినియోగం చట్టబద్ధంగా, పునఃసవిÖక్షించేలా ఉండాలని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ’ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’ లో గురువారం ప్రధాని ప్రసంగించారు. మానవ అభివద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని తెలిపారు. మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఆరోవంతు జనాభా భారత్‌లోనే ఉందని, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని చెప్పారు. కత్రిమ మేథను ఉపయోగించుకోవడంలో దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. భారత్‌లో ఏఐ పురోభివద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందన్నారు. కత్రిమ మేథకు పరివర్తన శక్తి ఉందని ప్రధాని చెప్పారు. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని, అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందని అన్నారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాదు.. ప్రస్తుతం కత్రిమ మేథను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్న అని అన్నారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్‌మార్క్‌లు అని, మానవ కేంద్రీకత ఏఐ నిర్మాణం మన లక్ష్యం అవ్వాలని ప్రధాని అన్నారు. కత్రిమ మేథ మనలను శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని మోదీ చెప్పారు. కత్రిమ మేథ వినియోగంలో ’మానవ్ విజన’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్ అర్థం, ఫ్రేమ్‌వర్క్ అని ఆయన వివరించారు.