బోయిన్ పేట్ ప్రజల మాటే నాకు శిరోధర్యం

 

 

 

 

 

కౌన్సిలర్ కు వచ్చే జీతం ప్రతి నెల ఒక నిరుపేదకు ఇస్తాము

బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి
మంథని, (జనంసాక్షి) : ఇటీవల జరిగిన మంథని మున్సిపల్ ఎన్నికల్లో బోయిన్ పేట్ 6 వార్డ్ నుండి ఇండిపెండెంట్ గా సింహం గుర్తుపై పోటీ చేసి పెద్దపల్లి జిల్లా లోనే భారీ మెజారిటీ తో గెలుపొందిన పోతరవేని శ్రీలతక్రాంతికుమార్ బోయిన్ పేట్ ప్రజల మాటే నాకు శిరోదార్యం అని తనకు వచ్చే నెల జీతాన్ని ప్రతి నెల బోయిన్ పేట్ లోని ఒక నిరుపేద కుటుంబానికి అందజేస్తానని బుధవారం రాత్రి నాగులమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. అలాగే అధికార పార్టీ నాయకులు ఎన్నో ఒత్తిడులకు గురిచేసిన కూడా వాటిని లెక్కచేయకుండా ఇంతటి భారీ విజయాన్ని అందించిన బోయిన్ పేట్ 6 వార్డ్ ప్రజలకు అండగా నిలిచి ప్రతి ప్రభుత్వం పథకాన్ని వారి గడప కాడికి అందించేలా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. అలాగే బోయిన్ పేట్ అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తు గతంలో చేసిన సేవలు అలాగే కొనసాగుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బోయిన్ పేట్ ప్రజలు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.