శభాష్ రేవంత్ టీం..
` మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రశంసించిన ఖర్గే, రాహుల్
` ప్రజల తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ
` సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం
` తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంపై ఎక్స్ వేదికగా ఖర్గే వెల్లడి
` కాంగ్రెస్ అగ్రనేతలతో రెండుగంటలపాటు ముఖ్యమంత్రి, మంత్రుల భేటీ
` మేడారం జాతర విజయవంతంగా నిర్వహణకు మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు
న్యూఢిల్లీ(జనంసాక్షి):సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘ప్రజల తెలంగాణ‘ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణను రూపొందించినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించడం తమ ప్రధాన సంకల్పమని ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సవిÖక్ష సమావేశం జరిగింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్క్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందించారు. ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ ,స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం నేపథ్యంలో ఈ సవిÖక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన హావిÖలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మల్లికార్జున ఖర్గే తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని, రాష్ట్ర నాయకులు, మంత్రులతో కలిసి సమగ్ర సవిÖక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా తదుపరి కార్యాచరణపై చర్చించామని, సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షలను సాకారం చేస్తూ సమగ్ర తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సుమారు 2 గంటలపాటు భేటీ కొనసాగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం, మంత్రులు, నాయకులతో సమగ్ర సవిÖక్ష నిర్వహించాం. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం చేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఇచ్చిన హావిÖలను అమలు చేస్తున్నాం అని ఖర్గే పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు అభినందించారు. ఆదివాసీల అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై సుమారు పది నిమిషాల పాటు చర్చ జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ.. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి సీతక్కను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క`సారలమ్మల పోరాట గాథను ఖర్గే, రాహుల్ ఆసక్తిగా విన్నారు. సమ్మక్క ? సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేందుకు సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించారు. పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క, రాహుల్ గాంధీ మధ్య సరదా సంభాషణ జరిగింది. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తాము తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్ గాంధీ అన్నారు. ’ఆహ్వానిస్తే తాను కూడా తల్లుల దర్శనానికి వచ్చే వాడిని’ అని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే సమయాభావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు మంత్రి సీతక్క వివరించారు. వచ్చే జాతరకు తప్పకుండా అధికారిక ఆహ్వానం అందిస్తామని సీతక్క అన్నారు. ’ఆహ్వానం అందితే తప్పకుండా వస్తాము’ అని రాహుల్ గాంధీ, ఖర్గే హావిÖ ఇచ్చారు.

