‘సర’కు సిద్ధంగా ఉండండి

` ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాలకు ఈసీ లేఖ
` అందుకు సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఆదేశం
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 22 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. దేశ వ్యాప్తంగా ఎసఐఆర్ ప్రక్రియ చేపట్టాలని గతేడాది జూన్‌లో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బిహార్‌లో ‘సర’ పూర్తి కాగా.. ప్రస్తుతం తొమ్మిది రాష్టాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అస్సాంలో మాత్రం ఎసఐఆర్‌కు బదులు ‘ప్రత్యేక సవరణ’ పేరుతో ఓటరు జాబితా సవరణను పూర్తి చేశారు.