ఏఐ ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వద్ధిలో నడిపిస్తాయి

` భారత్‌లో మార్పులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి
` విశాఖ మీదుగా ఐఐటి ఖరగ్‌పూర్‌కు వెళ్లేవాడిని
` అదే విశాఖలో ఇప్ప్పుడు గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం
` ఏఐ సదస్సులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
` డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు
` పలువురు టెక్ దిగ్గజాల వెల్లడి
న్యూఢిల్లీ(జనంసాక్షి): డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తోందని, ఏఐ కేంద్రంగా మారుతోందని పలుదేశాల ప్రతినిధులు ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కత్రిమ మేధ సదస్సుకు భారత్ వేదికైంది. దిల్లీలోని భారత మండపంలో జరుగుతోన్న ’ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట’లో 118 దేశాలు పాల్గొన్నాయి. గురువారం జరిగిన సదస్సు అధికారిక ప్రారంభ కార్యక్రమంలో పలువురు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను వద్ధి పథంలో నడిపిస్తాయి. ఏఐ నిర్మాణం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. భారత్‌ను సందర్శించిన ప్రతిసారీ మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నా. విద్యార్థిగా ఉన్నప్ప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు విశాఖ విÖదుగా వెళ్లేవాడిని. అదే విశాఖ తీరంలో ఇప్ప్పుడు గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటవుతోంది‘ అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తోంది. గతంలో భారత్‌లో బ్యాంకు ఖాతా తెరవాలంటే సమస్యగా ఉండేది. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు లేకుండానే బ్యాంకు ఖాతా తెరవగలుగుతున్నారు. ఫోన్‌లోనే బ్యాంకు ఖాతా తెరిచే సౌలభ్యం వచ్చింది. 140 కోట్ల మంది ప్రజలకు భారత్ డిజిటల్ ఐడెంటిటీ తీసుకొచ్చింది. ఆవిష్కరణల పథంలో అందరూ కలిసి ముందుకు సాగాలి. ప్రతినెలా 20 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. 500 మిలియన్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలు ఇచ్చారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసించారు. ఏఐ కత్రిమమైనది కాదు.. వాస్తవమైనదని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ఏఐ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్యక్రమాలకు భారత్ సాక్షిగా నిలుస్తోంది. 140 కోట్ల మంది ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ కలిగిఉంది. ప్రపంచంలో జరిగే వాటిలో భారత్ నుంచే సగం డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి. భారత్‌ను ఏఐ కేంద్రంగా ప్రధాని తీర్చిదిద్దుతున్నారు. సెవిÖకాన్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా సాంకేతికత అభివద్ధి జరుగుతోంది. ఏఐ నైపుణ్య శిక్షణలో భారత్ పురోభివద్ధి సాధిస్తోందన్నారు. గత దశాబ్దకాలంగా ఏఐ వేగంగా ముందుకెళ్తోంది. అతి త్వరలోనే మనుషులు చేసే అత్యంత క్లిష్టమైన పనులను ఏఐ మోడళ్లు సులువుగా పూర్తి చేసే రోజులు రానున్నాయి. ఏఐతో అవకాశాలతో పాటు సవాళ్లూ ఉన్నాయి. ఆ సవాళ్లను పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పేర్కొన్నారు.
ఏ దేశానికీ సాధ్యం కానిది భారత్ చేసింది: మెక్రాన్
“డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తోంది. గతంలో భారత్‌లో బ్యాంకు ఖాతా తెరవాలంటే సమస్యగా ఉండేది. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు లేకుండానే బ్యాంకు ఖాతా తెరవగలుగుతున్నారు. ఫోన్‌లోనే బ్యాంకు ఖాతా తెరిచే సౌలభ్యం వచ్చింది. 140 కోట్ల మంది ప్రజలకు భారత్ డిజిటల్ ఐడెంటిటీ తీసుకొచ్చింది. ఆవిష్కరణల పథంలో అందరూ కలిసి ముందుకుసాగాలి. ప్రతినెలా 20 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. 500 మిలియన్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలు ఇచ్చారు” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసించారు.
ఏఐ వాస్తవం: చంద్రశేఖరన్
“ఏఐ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. డిజిటల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్యక్రమాలకు భారత్ సాక్షిగా నిలుస్తోంది. 140 కోట్ల మంది ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ కలిగిఉంది. ప్రపంచంలో జరిగే వాటిలో భారత్ నుంచే సగం డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి. భారత్‌ను ఏఐ కేంద్రంగా ప్రధాని తీర్చిదిద్దుతున్నారు. సెవిÖకాన్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా సాంకేతికత అభివద్ధి జరుగుతోంది. ఏఐ నైపుణ్య శిక్షణలో భారత్ పురోభివద్ధి సాధిస్తోంది. ఏఐ కత్రిమమైనది కాదు.. వాస్తవమైనది” అని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు.
భారత్‌ది కీలక పాత్ర: డారియో
“గత దశాబ్దకాలంగా ఏఐ వేగంగా ముందుకెళ్తోంది. అతి త్వరలోనే మనుషులు చేసే అత్యంత క్లిష్టమైన పనులను ఏఐ మోడళ్లు సులువుగా పూర్తి చేసే రోజులు రానున్నాయి. ఏఐతో అవకాశాలతో పాటు సవాళ్లూ ఉన్నాయి. ఆ సవాళ్లను పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది” అని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పేర్కొన్నారు.