బాధిత కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

 

 

 

 

 

… ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..
జనం సాక్షి రాయికల్:
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మల్యాల బాలయ్య యాదవ్ చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు జారీ పడిపోగా మెదడు మరియు వెన్నుపూసకు బలమైన గాయం కాగా చికిత్స చేసుకొనే ఆర్థిక స్తోమత లేక స్తానిక నాయకులు మాజీ కో ఆప్షన్ మెంబర్ యం.ఏ. మోఖీద్ నాయకులు అజిత్ రావు విషయాన్నీ ఎమ్మేల్యే సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మేల్యే మెరుగైన చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో రెండు లక్షల రూపాయల ఎల్ఓసి బాలయ్య కుటుంబానికి గురువారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోఖీద్, అజిత్ రావు, స్పందన సాగర్ రావు, దొబ్బల వేణు,తదితరులు పాల్గొన్నారు.