గులాబీ గళమే తెలంణకు బలం: వికారాగాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈరోజు (29-08-2022) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వారి నివాస ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని మోమిన్ కలాన్, రాజాపూర్ మరియు స్టేషన్ ధారూర్ గ్రామాలకు చెందిన వార్డు మెంబర్ జమునా బాయ్ రాజు, ధారూర్ మండలం BJP పార్టీ ST మోర్చ అధ్యక్షులు V.గోపాల్, కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు మనీష్, వినయ్, అశోక్, అంజి, బాలరాజ్, శ్యామ్, హరిష్, మహేందర్ వారి అనుచరులు 80 మందిని TRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.