ఘనంగా గౌరమ్మ నిమజ్జనం.

ఫోటో రైటప్: శోభాయాత్ర వెళుతున్న మహిళలు.
బెల్లంపల్లి, ఆగస్టు30, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలో మంగళవారం గౌరమ్మ (గురుగుల) నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. నేతకాని సామాజిక వర్గానికి అతి ముఖ్యమైన పండగ అయిన పొలాల అమావాస్యలో భాగంగా గౌరమ్మలను (గురుగులను) మేళా తాళాలతో, బ్యాండు, డప్పు చప్పుళ్ళు, డిజే పాటలతో నిమజ్జనం అనంతరం నృత్యాలతో మహిళలు గౌరమ్మ నిమజ్జనం చేశారు. ఈ ఘట్టంతో నేతకని సామాజిక వర్గానికి చెందిన వారు పొలాల పండగ పూర్తి అయినట్టుగా భావిస్తారు