ఘనంగా చాకలి ఐలమ్మ127 జయంతి

 తెలంగాణ వీరనారి  చాకలి ఐలమ్మ 127 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మానవపాడు సర్పంచ్ హైమావతి దామోదర్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సబ్బండ వర్గాలకు, మహిళ చైతన్యానికి ప్రతీకగా నిలిచారని, పేదల తరుపున పెత్తందారులతో పోరాడిన ఐలమ్మ తెలంగాణ వీరత్వానికి నిదర్శనం అని,భూమి కోసం, భుక్తి కోసం ,వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములను ఎదురిస్తూ పోరాడటం తో పాటు  పీడిత ప్రజలను చైతన్యం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని.ఆమె పోరాట స్ఫూర్తి అందరికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మీదేవి మద్దిలేటి, ఉప సర్పంచ్ పైహిల్మాన్, గొల్ల వెంకట్రాముడు, రంగస్వామి, మహేష్, నాగన్న మార్కెట్, మద్దిలేటి, హుసేన్ ప్ప
 నరసింహులు బోరవెల్లి, శేషన్న, తదితరులు పాల్గొన్నారు
Attachments area

తాజావార్తలు