ఘనంగా టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ జన్మదిన వేడుకలు.

తాండూరు అగస్టు 24(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు యువకులు శ్రేయోభి లాషులు మధ్య టిఆర్ఎస్ యువనాయకులు ఉమా శంకర్ తననివాసంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తాండూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామలింగారెడ్డి, మహిళా నాయకు రాలు శకుంతల అంతారం సర్పంచ్ రాములు తదితరులు జన్మదిన వేడుకలో పాల్గొని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. జన్మదిన వేడుకలలో పార్టీల కతీతంగా నాయకులు యువకులు పాల్గొని జనహృదయువనేత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.