ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 3 : ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా దుర్గమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పవిత్రోత్సవాలకు తోడు శ్రావణ శుక్రవారం కూడా కావడంతో భక్తులు అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు శుక్రవారం జరిగిన పూర్ణాహుతితో ముగిసాయి. ఈ సందర్భంగా వేలాదిమందికి ప్రసాదవితరణ చేశారు.