70కోట్ల ఓటర్ల తొలగింపు

` తొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర’ జాబితా విడుదల
` అత్యధికంగా గుజరాత్.. అత్యల్పంగా కేరళ
` తమిళనాడు, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో ఇంకా పూర్తిగా విడుదలకాని జాబితా
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తొమ్మిది రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.70 కోట్లకుపైగా ఓటర్లను ఈసీ తొలగించింది. గతేడాది అక్టోబరులో ఎసఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి మునుపు ఆయా రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 19.75 కోట్లకు తగ్గింది. అంటే ఓటర్ల సంఖ్యలో 7.93శాతం తగ్గుదల నమోదైంది.గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గోవా, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌కు చెందిన తుది ఓటరు జాబితాలను ఈసీ గతవారం విడుదలు చేసింది. వాటిని విశ్లేషించగా ఈ గణాంకాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాల నుంచి అనర్హులను తొలగించాలన్న లక్ష్యంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఈసీ శ్రీకారం చుట్టింది. తొలుత బిహార్‌లో ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం 12 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎసఐఆర్ కొనసాగుతోంది.
గుజరాత్‌లో అత్యధికం` కేరళలో అత్యల్పం
ఇక అత్యధిక తగ్గుదల గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఓటర్ల జాబితాలో నుంచి 68.12 లక్షల పేర్లు తొలగించారు. దీంతో అక్కడ ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 4.40 కోట్లకు చేరుకుంది. అంటే 13.4 శాతం తగ్గింది.మధ్యప్రదేశ్‌లో ఓటర్ల జాబితా నుంచి 34.35 లక్షల పేర్లు తొలగించారు. ఆ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 5.74 కోట్ల నుంచి 5.39 కోట్లకు చేరింది. అంటే 5.96శాతం తగ్గుదల నమోదైంది.రాజస్థాన్‌లో 31.36 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 5.46 కోట్ల నుంచి 5.15 కోట్లకు చేరింది. అంటే 5.74శాతం తగ్గుదల నమోదైంది.ఛత్తీస్‌గఢ్‌లో ఓటర్ల జాబితా నుంచి 24.99 లక్షల పేర్లను తొలగించారు. ఓటర్ల సంఖ్య 2.12 కోట్ల నుంచి 1.87 కోట్లకు చేరుకుంది. 11.77 శాతం తగ్గుదల నమోదైంది.కేరలో అత్యల్పంగా పేర్లును తొలగించారు. ఓటర్ల జాబితా నుంచి 8.97 లక్షల పేర్లు తొలగించారు. 3.22 శాతం తగ్గుదల నమోదై ఓటర్ల సంఖ్య 2.78 కోట్ల నుంచి 2.69 కోట్లకు చేరింది.గోవాలో 1.27 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. అంటే 10.7శాతం తగ్గుదల నమోదైంది.
కేంద్రపాలిత ప్రాంతాలు
అండమాన్ అండ్ నికోబార్‌లో అత్యధిక శాతం తగ్గుదల నమోదైంది. 52,364 పేర్లు తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 3.10 లక్షల నుంచి 2.58 లక్షలకు చేరుకుంది. అంటే 16.87 శాతం ఓటర్లు తగ్గారు.పుదుచ్చేరిలో 77,367 ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో 7.5శాతం ఓటర్లు తగ్గారు.లక్షద్వీప్‌లో కేవలం 206 పేర్లను మాత్రమే తొలగించారు. అంటే 0.36శాతం ఓటర్లు తగ్గారు.
ఇప్పటి వరకు 2.16 కోట్ల ఓటర్లు తొలగింపు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌లో ఎసఐఆర్ ప్రక్రియ తర్వాత విడుదల చేసిన గణాంకాలను కూడా కలుపుకుంటే మొత్తం తొలగింపుల సంఖ్య 2.16 కోట్లకు చేరాయి. అంటే 7.37 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించారు. బిహార్?లో 2025 జూన్‌లో 7.89 కోట్ల ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 2025లో 7.43 కోట్లకు తగ్గుదల
ఇంకా విడుదల కావాల్సిన రాష్టాలు
తమిళనాడు, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్టాల ఓటర్ల జాబితా ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. తమిళనాడు తుది జాబితా సోమవారం విడుదల కానుంది. బంగాల్?లో దశలవారీగా విడుదల అవుతుంది. ఉత్తరప్రదేశ్ ఏప్రిల్ 6న తన జాబితాను విడుదల చేస్తారు.
అసోంలో ప్రత్యేక సవరణ
ఇక అసోంలో ఎసఐఆర్ బదులుగా స్పెషల్ రివిజన్‌ను చేపట్టారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 10న పూర్తి అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో 2.45 కోట్ల ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 2.52 కోట్లు కాగా, తుది జాబితాలో 2.49 కోట్ల ఓటర్లు ఉన్నారు.