ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా

 

 

 

 

 

ఫిబ్రవరి 23 ( జనం సాక్షి):ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇరుకైన బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్లే ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా మంత్రికి ఆర్టీసీ ఎండీ వివరించారు.

కాగా, ఈ ఘటనపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీతోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనాస్థలంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఆర్టీసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఐదుగురు గాయపడ్డారు.