రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
` గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుంది
` నీళ్ల విషయంలో రాజకీయాలొద్దు
` ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం
` మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను గాలికి వదిలేయం
` నిపుణుల సూచన ప్రకారం మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తాం
` ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులను వథాగా పోనివ్వం
` సీఎం కుర్చీ అనేది ప్రతిసారి వారసత్వంగా దక్కదు
` టీడీపీ, కాంగ్రెస్, బీఆరఎస్‌కు వరుసగా రెండుసార్లు చొప్పున ప్రజలు అవకాశం ఇచ్చారు
` కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు మరో అవకాశం ఇస్తారు
` విపక్షం అసెంబ్లీకి వచ్చి గోదావరి జలాలపై సూచనలు చేస్తే స్వీకరిస్తాం
` ` దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
` అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం సవిÖక్ష
ములుగు(జనంసాక్షి):గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయరంగు పులుముకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వివాదమే ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆరఎస్?పై ఆయన పలు విమర్శలు గుప్పించారు.వచ్చే రెండు మూడేళ్లలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కత నిశ్చయంతో ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విÖదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేయడం వల్ల మిగతా వాటికి, భూ సేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఉందని తెలిపారు. రూ.6వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టు ఇవాళ రూ.18 వేలకోట్ల నిధులు అవసరమైన స్థితికి చేరుకుందన్నారు. అన్ని ప్రాజెక్టులపై సవిÖక్ష చేసి పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి చేసుకుని రాష్టాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు.మేడిగడ్డ కుంగిన తర్వాత అక్కడి నుంచి నీరు ఎత్తిపోయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం నిరుపయోగమైనా అత్యధికంగా వరి దిగుబడి వస్తోందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో చర్చించామని చెప్పారు. కేసీఆర్, హరీశ్‌రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించారని, తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి వివరించారు. పదేళ్లు వాళ్లేం చేశారో ఈ ప్రభుత్వం ఏ చేసిందో సభలో చర్చిస్తామన్నారు. ప్రతిపక్షం వారు సూచనలు చేస్తే మేం స్వీకరిస్తామన్న రేవంత్ రెడ్డి జలాల విషయంలో ఏపీకి సహకరిస్తున్నామనేది పూర్తిగా అసంబద్ధమని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామని ప్రజలు, నీళ్ల విషయంలో కాదని ఆయన హితవు పలికారు. పలు ఎన్నికల్లో తీర్పు చూసిన తర్వాతైనా బీఆరఎస్ నేతలు మారకపోవటం విచారకరమన్నారు. ఆ పార్టీని మళ్లీ గెలిపించకపోవడం ప్రజల తప్పనట్లుగా వారు వ్యవహరిస్తున్నారన్నారు. ఓటు వేసిన ప్రజలను బహిష్కరించినట్లు చేయటం సరికాదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలను తప్పుపట్టడం మానేసి విజ్ఞతగా వ్యవహరించాలని హితవు పలికారు.సీఎం కుర్చీ అనేది ప్రతిసారి వారసత్వంగా దక్కదని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆరఎస్‌కు వరుసగా రెండుసార్లు చొప్పున ప్రజలు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు మరో అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను గాలికి వదిలేయమని పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టులను వథాగా వదిలేసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిపుణుల సూచన ప్రకారం మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని వెల్లడించారు. విపక్షం అసెంబ్లీకి వచ్చి గోదావరి జలాలపై సూచనలు చేస్తే స్వీకరిస్తామని చెప్పారు. ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే దిశలో ఉన్నామని వెల్లడించారు
హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుంచి రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం
` ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకుల వినతి
హైదరాబాద్(జనంసాక్షి):హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్‌లోనే ఈ కార్యక్రమం జరుగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం. ఈ సింపోజియంలో ప్యానెల్‌లో ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివద్ధి, ఏఐ సిటీ అభివద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుస రిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానవిÖ, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
.



