సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
పెనుబల్లి,
ఫిబ్రవరి 22(జనం సాక్షి )ఖమ్మం జిల్లా పెనుబల్లిమండలం రామచంద్రపురంగ్రామంలో ఆదివారంసత్తుపల్లి ఎం ఎల్ ఏ డాక్టర్ మట్టా రాగమయిసీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ 6 కు కాలువ పనులకు భూమి పూజ చేశారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై లక్షలాది కోట్ల రూపాయలను వెచ్చించి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసిందని సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తిగా అశ్రద్ధ చేసి వదిలేసిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ కాలువ పనులు ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. దీని వెనుక మంత్రి తుమ్మల కృషితోపాటు , మంత్రులు బట్టివిక్తమార్క ,పొంగులేశ్రీనివాసరెడ్డి సహకారంతో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని ఆమె అన్నారు. రూ.327 కోట్లు వ్యయంతో 39 కిలోమీటర్లు కాలువ నిర్మాణం చేపట్టి 58,095 ఎకరాలకు నీరు పుష్కలంగా అందుతుందని అన్నారు. ఈ కాలువ నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. కాలువ నిర్మాణ పనులకు రైతులు పూర్తి సహకారం అందించడం జరిగిందని ఆమె అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రిజ్వాన , తాసిల్దార్ వీరభద్ర నాయక్ ఎంపీడీఓ అన్నపూర్ణ, నీటిపారుదల శాఖ అధికారులు , కేఎన్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ జనార్ధన్,జీ ఎం జాషువా,పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, మండలం కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


