ఘనంగా రేవూరి జన్మదిన వేడుకలు
ఖానాపురం సెప్టెంబర్ 1జనం సాక్షి
నర్సంపేట మాజీ శాసనసభ్యులు బిజెపి రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలో బిజెపి నాయకులు శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి రేవూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల ఇంచార్జి కంబంపాటి ప్రతాప్ ,మండల కార్యదర్శి జల్లి మధు ,మండల ఉపాధ్యక్షులు కొరటాల శ్రీను మరియు గొల్లపెల్లి వెంకన్న,జిల్లా మైనారిటి ఉపాద్యక్షుడు కాశిం,మండల మహిళ మోర్చ అధ్యక్షురాలు కనక దుర్గ ,కల్యాణి,గండమల్ల విజయ,బీజేవైఎం అద్యక్షుడు ముకేశ్,కిసాన్ మోర్చ అద్యక్షుడు మల్లా రెడ్డి,మాజీ మండల అద్యక్షుడు రాజ్ కుమార్ ,మండవ నరేశ్,చిన్న వెంకన్న,ఈసం లక్ష్మినారాయణ ,ఆకుల సందీప్,మచ్చిక శ్రీధర్ ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.