చండి హోమానికి రండి
మదన్ రెడ్డికి ఆహ్వానం శివ్వంపేట సెప్టెంబర్ 28 జనంసాక్షి : మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామస్తుల సహకారంతో భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత సన్నిధిలో ఈనెల 29న గురువారం ఉదయం జరిగే చండీ హోమంలో పాల్గొనాలని నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డిని పిల్లుట్ల సర్పంచ్ పెద్దపులి రవి, టీఆరెఎస్ మండల పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ బుధవారం ఆహ్వానించారు. చండీ హోమం అనంతరం అమ్మవారి సన్నిధిలో దాతలు బండారి సంతోష గంగాధర్ దంపతులు నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరినట్లు వారు తెలిపారు. పిల్లుట్లలో జరిగే చండీ హోమం, అన్నదాన కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అమ్మవారి భక్తులు, గ్రామస్తులు తప్పకుండా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పిల్లి మారుతి,ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాసంపల్లి శ్రీధర్ గౌడ్, పెద్దపులి సతీష్, హనుమాన్ సేన రాజిరెడ్డి, పెద్దపులి శంకర్, గొల్ల శ్రీశైలం,కుమ్మరి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.