చేనేత అభివృద్దికి మంత్రి కెటిఆర్‌ అహర్నిశలు కృషి


చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన చిరుమర్తి
నల్లగొండ,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉపాధిరంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రగతి బాటలో నడిపేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెల్లడిరచారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చేనేత వస్త్రాలను ధరించాలనిచ్చిన పిలుపుతో రాష్ట్రంలో చేనేత వస్త్ర దుకాణాలు కళకళలాడుతున్నాయని చెప్పారు. చేనేత పరిశ్రమకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నకిరేకల్‌ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కుటుంబాలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కో రంగాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నేతన్నకు చేయూత పథకానికి ప్రభుత్వం రూ.338 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు.నియోజకర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, పింఛన్లు అందించేవిధంగా కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వాటికి అవసరమైన అదనపు నిధులను కూడా మంజూరు చేయించి నిర్మాణ పనులను చేపడుతామని హావిూ ఇచ్చారు.