జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.
అన్నదానం చేస్తున్న సభ్యులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్25,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో ఆదివారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల కోరిక మేరకు ఈ రోజు 125 వ సారి అన్నదాన కార్యక్రమం దాత కీశే. ఎలుక అమృతమ్మ, రాజయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తె అల్లుడు మైలరపు ఉమాదేవి, సత్యనారాయణ సహకారంతో యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శులు పెద్ది వినయ్ కుమార్, పతంగి సంతోష్, గౌరవ సలహాదారు నిచ్చకోల రాజన్న, సభ్యులు పాయవేణి మల్లేష్, బియ్యల అంజయ్య, గుమ్ముల చందు, నిచ్చకోల సాయి ఈశ్వర్ పాల్గొన్నారు.