జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలి

కడప, జూలై 28 : సుఎంతో ఘన చరిత్ర కలిగిన కడప జిల్లాలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించక పోవడం దురదృష్టకరమని పుట్టపర్తి సాయితీ పీఠం కార్యదర్శి బ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పర్యాటక ఉత్సవాలను నిర్వహిస్తుందని కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రం నిర్వహించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి కడప, కర్నూలు జిల్లాలో ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.