జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ కు ఘనంగా వీడ్కోలు

నల్గొండ బ్యూరో. జనం సాక్షి
      జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ జిల్లా లో మంచి  పనితీరు తో సేవలు అందించారని పలువురు జిల్లా అధికారులు,ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన అగ్నిమాపక శాఖ అధికారులు,సిబ్బంది అన్నారు.సోమవారం జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయం లో యజ్ఞ నారాయణ గ్రేటర్ కార్పొరేషన్ హైద్రాబాద్ కి బదిలీ పై వెళుతున్న సందర్భంగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
గత 7 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ లు,వివిద శాఖల జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్త మంగా విధులు నిర్వర్తించారని వక్తలు ప్రశంసించారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు,సిబ్బంది శాలువలు, బొకేలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నోవా అధ్యక్షులు. రాజ్ కుమార్,టి.జి.ఓ.అసోసియేట్ అధ్యక్షులు సర్వే ల్యాండ్స్ ఏ.డి.యం.శ్రీనివాసులు,ఉపాధ్యక్షులు డి.పి.ఆర్.ఓ. పి.శ్రీనివాస్,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య,డి.యం.హెచ్.ఓ.డా కొండల్ రావు,డి. సి.హెచ్.యస్ డా.మాతృ నాయక్,ఎస్.సి.కార్పొరేషన్ ఈ. డి. వెంకటేశం,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.