జ్వరంతో చిన్నారి మృతి
విజయనగరం, ఆగస్టు 1 : డుమ్మంగి గ్రామంలో బిడ్డిక లిఖిత అనే చిన్నారి జ్వరంతో మృతి చెందింది. కడుపు పొంగడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇదిలా ఉండగా గిరిజన గ్రామాల్లో రోగాల తీవ్రత పెరిగింది. వైద్యులు సకాలంలో గిరిజన గ్రామల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యసహాయాన్ని అందించపోతే మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. దోమలు, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి.