టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గం మహాసభను జయప్రదం చేయండి

టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గం మహాసభను జయప్రదం చేయండి.
To: hydjanamsakshi <[email protected]>

 

  జహీరాబాద్ పట్టణం లో ఆదివారం ఉదయం జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ ) జహీరాబాద్ నియోజకవర్గ ద్వితీయ మహాసభను జయప్రదం చేయాలని జహీరాబాద్ నియోజక వర్గ నాయకులు రాయికోటి నర్సింలు పబ్బతి సంతోష్ కుమార్ మనికొండ బస్వరాజ్ లు పిలుపునిచ్చారు. స్థానిక తవకల్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అవుతుందన్నారు. ఝరాసంగం, కో హిర్,రాయికోడ్, న్యాల్ కల్,మోగుడం పల్లి మండలాల నుంచి వచ్చే పాత్రికేయ మిత్రులు సకాలంలో హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ,జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.