‘టీడీపీ మునిగిపోయే నావ లాంటింది’

విజయనగరం, ఆగస్టు 3 : తెలుగుదేశం పార్టీని ప్రజలు మరిచిపోయి చాలా సంవత్సరాలైందని, ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది నాయకులు అప్పుడప్పుడు కనిపిస్తారని మాజీ ఎంపీపీ కృష్ణంనాయుడు, ఆర్‌ఐసీఎస్‌ చైర్మన్‌ పొన్నాడ వెంకటరమణ, వలిరెడ్డి లక్ష్మణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీకి నాయకులే లేరని ఎద్దేవా చేశారు. టిడిపి మునిగిపోయే నావలాంటిది, దాన్ని ఎవరు కాపాడలేరన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బొత్స కుటుంబం కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బొత్స ఎనలేని సేవ చేశారన్నారు. అభివృద్ధి ఫలాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.