కేసీఆర్‌ పాలనలో ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్‌

` వ్యవస్థకు చికిత్స చేస్తున్నాం:సీఎం రేవంత్‌ రెడ్డి
` విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం
` లెక్చరర్లు కళాశాలను తీర్చిదిద్దాలి
` గత పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రం
` అధికారంలోరి రాగానే 55 రోజుల్లో నియామకాలు
` ఉద్యోగ నియామకపత్రాలు అందించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రానికి కేసీఆర్‌ ఆర్థికంగా క్యాన్సర్‌ ఇచ్చారని.. క్యాన్సర్‌ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా అని అంటున్నారని.. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారని అన్నారు. తాను వాస్తవాలు చెబుతుంటే? దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్‌లా అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ’అబద్దాల ప్రాతిపదికన తాను రాష్టాన్న్రి నడపను. వాస్తవాలు విూతో పంచుకుని రాష్టాభ్రివృద్ధికి కృషి చేస్తా. తెలంగాణలో భావితరాల భవిష్యత్‌ నిర్మాణానికి విూ సహకారం అవసరం. ఎంతసేపు సీఎం కుర్చీని లాక్కుంటామంటే ఎలా.. నన్ను పనిచేయనివ్వాలి కదా విూరు’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలను గొప్పగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత జూనియర్‌ లెక్చరర్ల విూద ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం సాగదీసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైందని.. కానీ తాము మాత్రం 55 రోజుల్లోనే నియామకాలు పూర్తి చేశామని రేవంత్‌ చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 1292 మంది జూనియర్‌ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నికల్‌ లెక్చరర్లకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరమన్నారు. కొత్తగా నియామకమైనవారు తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. ఉద్యోగాలపై కోర్టుల్లో చిక్కుముడులు విప్పుతూ సమస్యలు పరిష్కరిస్తున్నా మన్నారు. తెలంగాణలో ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలతో గవర్నమెంట్‌ విద్యాలయాలు పోటీ పడలేకపోవడం బాధాకరం అన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదువు చెప్పే వారికన్నా గవర్నమెంట్‌ లెక్చరర్లకే ఎక్కువ నాలెడ్జ్‌ ఉందని.. అయినా రిజల్ట్‌ వారికంటే తక్కువ రావడంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను తీర్చి దిద్దాలని చెప్పుకొచ్చారు. ఒక ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే..ఆ కుటుంబ భవిష్యత్‌ మారిపోతుందని.. వారి కష్టాలన్నీ తొలగిపోతాయని వివరించారు. భవిష్యత్‌ లో మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చి తాము ఇచ్చిన హావిూని నిలబెట్టుకుంటామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడటంలో నిరుద్యోగుల పాత్ర కీలకం అని గుర్తు చేశారు.ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటల ప్రకారం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభివృద్ధి పథంలో నడిస్తే భవిష్యత్‌తరాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగం కూడా ఒక కారణమన్నారు. తెలంగాణ సాధనలో నిరుద్యోగులది కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ కుటుంబంలో ఉద్యోగాలు పోవడం వల్లే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని గ్రహించాలన్నారు. 55 రోజుల్లోనే 11 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదని.. అది వారి భవిష్యత్‌కు పెట్టుబడి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచాలని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ను నిర్మించబోతున్నామన్నారు. ఇటీవలే 55 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ కోసం రూ.11000 కోట్లు కేటాయించామని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలన్నారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రపంచానికే తెలంగాణ నుంచి ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్రీడలు మన దేశ ప్రతిష్టను పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు. క్రికెటర్‌ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామన్నారు. బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చామన్నారు. పారాలింపిక్స్‌ క్రీడాకారిణి దీప్తికి గ్రూప్‌-2 ఉద్యోగం ఇచ్చామని అన్నారు. కొంతమంది స్టేచ్రర్‌ స్టేచ్రర్‌ అని మాట్లాడుతున్నారని.. స్టేచ్రర్‌ ఉందని విర్రవీగినవారు స్టెచ్రర్‌ విూదకు వెళ్లారన్నారు. స్టేచ్రర్‌ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదని తెలిపారు. కేసీఆర్‌ తమకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమే అని అన్నారు. ప్రతీ నెలా రూ. 6500 కోట్లు కేసీఆర్‌ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రరభాకర్‌, కేశవరావు, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, సిఎస్‌ శాంతికుమారి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.