ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…

ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు

ఏపీలో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి వస్తోంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వాహనదారులకు భారీగా జరిమానాలు విధించనున్నారు.

కొత్త రూల్స్ – జరిమానాలు:

  • హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా
  • సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 ఫైన్
  • డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు
  • సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ కు రూ. 1,000 జరిమానా
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5,000 ఫైన్ తో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం
  • ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 2 వేలు, రెండోసారి రూ. 4 వేలు జరిమానా
  • సెల్ ఫోన్ వాడుతూ వాహనం నడిపితే తొలిసారి రూ. 1,500… రెండోసారి రూ. 10 వేల ఫైన్
  • బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా
  • వాహనాల రేసింగ్ కు పాల్పడితే తొలిసారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల ఫైన్
  • ఆటో డ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా.
  • ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలకు లోబడి నడుచుకోవాలని వాహనదారులకు సూచించారు.