డాక్టర్ జయప్రకాష్ నారాయన్ జీవితం స్ఫూర్తి దాయకం. బిజెపి నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.
డాక్టర్ జయప్రకాష్ నారాయన్ జీవితం స్ఫూర్తి దాయకం. బిజెపి నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 11 (జనంసాక్షి). స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ జయప్రకాష్ నారాయన్ జీవితం స్ఫూర్తిదాయకమని బిజెపి నాయకులు లంశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం జనతదళ్ యు ఆధ్వర్యంలో జే. పి .నగర్ పార్కులో జయప్రకాష్ నారాయన్ 122వ జయంతి వేడుకలు నిర్వహించారు. జనత దళ్ యు జిల్లా అధ్యక్షులు అంబాల మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బిజెపి నాయకులు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ జయప్రకాష్ నారాయన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అసమైన త్యాగాలు చేశారని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులను ధైర్యంగా ఎదిరించి ప్రజల పక్షాన నిలబడిన నాయకుడిగా ఆయన అందించిన స్ఫూర్తి మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో కుసుమ విష్ణు ప్రసాద్. రఘు రాములు, అల్లే సత్యనారాయణ ,అంబదాస్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు