తినడానికి బియ్యం కూడా లేవు

 

 

 

 

 

 

సెప్టెంబర్ 16(జనం సాక్షి ):హైద‌రాబాద్ : వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌లో ప‌ని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేత‌నాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెల‌లుగా జీతాలు ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ‌పై ద‌య ఉంచి ఇప్ప‌టికైనా పెండింగ్ బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

హైద‌రాబాద్ ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్యం కేంద్రం వ‌ద్ద ఔట్ సోర్సింగ్ మ‌హిళా ఉద్యోగి మాట్లాడుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని గార్ల నుంచి వ‌చ్చాను. ఈసీజీ టెక్నిషీయ‌న్‌గా ప‌ని చేస్తున్నాను. ఐదు నెల‌ల నుంచి జీతాల్లేవు.. పిల్ల‌ల‌ను ఎలా పోషించుకోవాలి.. మేం ఎలా బ‌త‌కాలో అర్థం కావ‌డం లేదు. ఫేస్ యాప్‌లో కూడా ప్ర‌తి రోజు అటెండెన్స్ వేస్తున్నాం. అయినా కూడా జీతాలు ఇవ్వ‌డం లేదు. క‌నీసం సెలవులు కూడా ఇవ్వ‌డం లేదు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పిల్లల ఫీజులు కూడా క‌ట్ట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉండే మ‌మ్మ‌ల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటూ హేళ‌న చేస్తూ విలువ ఇవ్వ‌డం లేదు. ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో సంబంధం లేని ప‌నులు చేయిస్తున్నారు. తిన‌డానికి కూడా బియ్యం లేవు అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.