డెంగీతో బాలుడు మృతి

share on facebook

రంగారెడ్డి,నవంబర్‌21 (జనం సాక్షి) : 15 ఏళ్ల ఓ బాలుడు డెంగీకి బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలంలోని బోడంపహాడ్‌ గ్రామానికి చెందిన ఎం.డీ. ఫసియొద్దీన్‌(15) గత కొన్ని రోజులుగా డెంగీ

జ్వరంతో భాద పడుతున్నాడు. అతడి తలిదండ్రులు ఆస్పత్రిలో చూపించినప్పటికీ.. అతడిలో ఎలాంటి మార్పు రాకపోగా, రోగం వికటించి ఉదయం మరణించాడు. ఫసియొద్దీన్‌ మన్‌మర్రి జెడ్‌పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తమ కుమారుడు మరణించడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయి, విలపిస్తున్నారు. బాలుడి మరణంతో గ్రామంలో, అతడు చదువుకుంటున్న పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Other News

Comments are closed.