అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
కొత్త పార్టీ ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించిన మస్క్
అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని వెల్లడి
వాషింగ్టన్(జనంసాక్షి): వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని మస్క్ పేర్కొన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తానని ఇటీవల మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అనుకున్నట్లుగానే ఆయన కొత్త పార్టీ పేరును వెల్లడిరచారు. గతంలో ఎక్స్‌లోనూ మస్క్ పార్టీ పెట్టే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ క్రమంలో అప్పట్లోనే ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది.మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసుకొచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు.. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజైన శుక్రవారం అధ్యక్షుడి సంతకంతో చట్ట రూపు సంతరించుకుంది. ట్రిలియన్లకొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతోపాటు 1.2 ట్రిలియన్ డాలర్ల విలువైన మెడిక్‌ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన చట్టమిది. దీంతోపాటు వలస సేవల విభాగానికి ఇది మరిన్ని నిధులను అందించనుంది. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనాల ప్రకారం.. పదేళ్లలో 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును తీర్చనుంది. అదే సమయంలో 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరమవుతారు.