బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
` 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరిక
వాషింగ్టన్(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.ఈమేరకు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. ‘’ బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10శాతం టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు’’ అని ట్రంప్ స్పష్టంచేశారు.బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నవేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రియో డి జనీరో నగరంలో ఈ సదస్సు ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది. మస్క్ గాడి తప్పాడు.. కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఫైర్ మరోవైపు, ప్రపంచదేశాలతో ట్రేడ్ డీల్స్ అంశం పైనా ట్రంప్ పోస్ట్ చేశారు. వాణిజ్య చర్చలకు సంబంధించి సోమవారం నుంచి (అమెరికా కాలమానం ప్రకారం) పలు దేశాలకు లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. కొత్త టారిఫ్‌లు, అమలు తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడిరచారు. మరోవైపు, ఈ నూతన వాణిజ్య సుంకాల తాత్కాలిక నిలిపివేతను అగ్రరాజ్యం మరికొన్ని రోజులు పొడిగించింది. తొలుత జులై 9 డెడ్‌లైన్ ఉండగా.. తాజాగా ఆగస్టు 1 నుంచి నూతన టారిఫ్‌లను అమలుచేయనుంది. ఈమేరకు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ధ్రువీకరించారు. దీంతో అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చల కోసం ఇతర దేశాలకు మరింత సమయం లభించినట్లయ్యింది. ‘’ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ (%ణశీఅaశ్రీస ుతీబఎజూ%) వాణిజ్య ఒప్పందాలను నిర్ణయించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందువల్ల కొత్త టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి’’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లుట్నిక్ వెల్లడిరచారు.
సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు
` బ్రిక్స్ దేశాలు ఘర్షణ కోరుకోవట్లేదు..
` ట్రంప్ టారిఫ్’ బెదిరింపుపై చైనా స్పందన
బీజింగ్(జనంసాక్షి):బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా స్పందించింది. బ్రిక్స్ గ్రూప్ ఘర్షణ కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. ‘’టారిఫ్ విధింపు విషయంలో మా స్పందనలో ఏ మార్పు లేదు. సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు. రక్షణాత్మక వైఖరితో ముందుకువెళ్లలేం’’ అని చైనా పునరుద్ఘాటించింది.బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నవేళ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘’బ్రిక్స్‌లో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10శాతం టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు’’ అని స్పష్టంచేశారు. ఈ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈక్రమంలోనే ట్రంప్ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. వాణిజ్య సుంకాల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లక్రితం చైనా-అమెరికాల మధ్య సుంకాల యుద్ధం నడిచింది. తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో అది కొద్దిమేర సమసిపోయింది. ఇదిలాఉంటే.. బ్రిక్స్ దేశాలు డాలర్‌తో ఆటలు ఆడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని గతంలో ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ‘’బ్రిక్స్ ఓ చెడ్డ ప్రతిపాదనను తీసుకొచ్చింది. చాలామందికి అది ఇష్టం లేదు. ప్రస్తుతం దానిపై మాట్లాడటానికి కూడా వారు వెనుకాడుతున్నారు. డాలర్‌తో ఆడుకోవాలనుకుంటే చర్యలు తీసుకుంటాననే నా హెచ్చరికతో వారు భయపడ్డారు. మాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే.. ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తా. ఒకవేళ వారు అది చేయాలనుకుంటే.. టారిఫ్‌లు విధించవద్దని నా దగ్గరకు వచ్చి వేడుకుంటారు. నా బెదిరింపులతో బ్రిక్స్ అంతమైంది’’ అని వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన బ్రిక్స్ కూటమిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు ఆ తర్వాత చేరిన సంగతి తెలిసిందే