పెండిరగ్‌లో ప్రాజెక్టుల పూర్తి చొరవ చూపాలి
` కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి
` సీఎం సూచనల మేరకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
హైదరాబాద్(జనంసాక్షి):కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని నీటి పారుదల శాఖ మంత్రిని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి లేఖ రాశారు.ఈనెల 16న ఢల్లీిలో కేంద్ర జల శక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో కోరారు. తెలంగాణలో చేపట్టిన ఆయా ప్రాజెక్టులు, స్థితిగతులు, పరిణామ క్రమంపైన సవివరంగా లేఖలో ప్రస్తావించారు.తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా గోదావరి నదీ బేసిన్‌లలో తాజా పరిస్థితులు, పరిణామాలు, ఏపీ ఉల్లంఘనలు, ఉత్పన్నమైన సమస్యలు, భవిష్యత్తు ప్రమాదాలపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని లేఖలో కోరారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగింది. గడిచిన పదేండ్లలో కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యధేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించింది.ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసింది. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టింది. దానికి బదులుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా మరియు గోదావరి నదీ బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు,రేవంత్‌రెడ్డిల భేటీ 16న
` ఢల్లీిలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏర్పాటు
` జలవివాదంపై కేంద్రం చొరవ
` నేడు ఢల్లీి వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు
న్యూఢల్లీి/అమరావతి(జనంసాక్షి): ఇరు తెలుగు రాష్టాల్ర మధ్య ఉన్న జల వివాదంపై చర్చకు తెలుగు రాష్టాల్ర సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న దిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కావాలని కేంద్రం కోరింది. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని పేర్కొంది. మరోవైపు కృష్ణా, గోదావరి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు. చంద్రబాబు బనకచర్ల ప్రతిపాదనలతో గోదావరి జలాలపై రచ్చ సాగుతోంది. ఈ క్రమంలో కేంద్రం ఈ భేటీ ఏర్పాటుచేయడం గమనార్హం. అయితే రేవంత్ ఢల్లీి వెళతారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఈనెల 17న రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢల్లీిలో పర్యటించనున్నారు. మంగళ, బుధవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ విూట్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం చంద్రబాబు ఢల్లీి పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించ నున్నారు. గ్రావిూణ ఉపాధి హావిూ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 4.30కు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. బుధవారం కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. నార్త్ బ్లాక్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ- కానున్నారు. ఎల్లుండి సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 8 మంది మంత్రులు, అధికారుల బృందం ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. ఈనెల 30వ తేదీ వరకు ఈ బృందం సింగపూర్ లో పర్యటించనుంది.మంత్రులు లోకేశ్,నారాయణ,టీ-బీ భరత్, ఐఏఎస్ అధికారులు కాటంనేని భాస్కర్, ఎన్.యువరాజ్,కార్తికేయ మిశ్రా,కె.కన్నబాబు,సాయికాంత్ వర్మ ఈ బృందంలో ఉంటారు.పర్యటన ప్రధాన అజెండా రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడమేనని సమాచారం. సింగపూర్ నగర ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు,ఓడరేవులు,మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి విషయాలను బృందం అధ్యయనం చేయనుంది.