ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు
` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు
` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై ఎయిర్‌క్రాప్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడిరచింది. విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడిరచింది. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కన్పించలేదని నివేదికలో తెలిపింది. ’విమానం ప్రయాణించిన మార్గానికి సవిూపంలో పక్షులు ఎగరలేదు. పక్షి ఢీ కొన్న ఆనవాళ్లు కూడా గుర్తించలేదు. వాతావరణ సంబంధిత సమస్యలు కూడా లేవు. ఆకాశం కూడా క్లియర్‌గా ఉంది. విజిబిలిటీ బాగుంది. గాలి స్వల్పంగా వీస్తోందని తెలిపింది. అంతేకాదు, ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. విమానంపై దాడి జరిగినట్లు- చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని వివరించింది. జూన్‌ 12న మధ్యాహ్నం 1:30
గంటల సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. దీంతో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాప్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడిరచింది. పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు- మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని మరో పైలట్‌ సమాధానం ఇచ్చాడని నివేదికలో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్‌ ఇచ్చారని, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడిరచింది. ఈలోపే విమానం కూలిపోయిం దని పేర్కొంది. విమానం టేకాఫ్‌ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్‌ స్విచ్‌లు ఆగిపోయినట్లు వెల్లడిరచింది. ఆ స్విచ్‌ ఎందుకు ఆఫ్‌ చేశావని ఒక పైలట్‌.. మరో పైలట్‌ను ప్రశ్నించాడని రిపోర్ట్‌లో పేర్కొంది. తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని మరో పైలట్‌ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తెలిపింది.ఈ రెండు స్విచ్‌లు ఒక సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో తెలిపింది. ప్రమాదానికి ముందు విమానం కేవలం 32 సెకన్ల పాటు గాల్లో ఉన్నట్లు- వెల్లడిరచింది. రన్‌వేకు కేవలం 0.9 నాటికల్‌ మైళ్ల దూరంలోని ఓ హాస్టల్‌ భవంతిపై విమానం కూలిపోయిందని నివేదిక వివరించింది. ఇంజిన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్‌ ఎయిర్‌ టర్బైన్‌ను యాక్టివేట్‌ చేసినట్లు గుర్తించారు. ఇది యాక్టివేట్‌ అయినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించిందని ఏఏఐబీ తమ నివేదికలో వెల్లడిరచింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ, ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు-, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవిూ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని, కలుషితమైన ఆనవాళ్లు లేవని తెలిపింది.