ఢల్లీికి సీఎం రేవంత్‌

` మంత్రలుకు శాఖలపై అధిష్టానంతో చర్చ
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డి శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢల్లీికి పయనం అయ్యారు. అక్కడ పార్టీ అగ్రనాయకులతో ఆయన బేటీ కానున్నారు. కొత్తగా మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 24 గంటలు కావోస్తున్న శాఖలపై ఇంకా క్లారిటీ రాలేదు. మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో రేవంత్‌ చర్చించునున్నారు. ప్రమాణం చేసిన రోజే శాఖల కేటాయింపు అనేది ఆనవాయితీగా వస్తుంది. మంత్రుల శాఖలపై భేటీ తరవాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే కేబినెట్‌ లో మరో ఆరు ఖాళీలపై కాంగ్రెస్‌ పెద్దలతో రేవంత్‌ చర్చించనున్నారు. శాఖల కేటాయింపుపై ఇప్పటికే సస్పెన్స్‌ కొనసాగుతోంది. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై అగ్రనేతలతో ఆయన చర్చించనున్నారు. ఢల్లీి పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి హస్తిన నుంచి రేవంత్‌ తిరుగు ప్రయాణం కానున్నారు. శనివారం ఉదయం ప్రొటెం స్పీకర్‌ చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ స్వీకర్‌ గా దాదాపు గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరు ఖరారు అయింది.  ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఏల చేత స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్‌ చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరు దాదాపు ఖరారు అయ్యింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. ఇకపోతే పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేయనున్నారు. లోక్‌ సభ స్పీకర్‌ హోమ్‌ బిర్లాను వ్యక్తిగతంగా కలిసి తన రాజీనామా పత్రాన్ని రేవంత్‌ రెడ్డి సమర్పించునున్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం  తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మొదటి రోజు ప్రజాదర్బార్‌ విజయవంతంగా ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ప్రజాభవన్‌కు వచ్చి తమ సమస్యలను ప్రజాదర్బార్‌లో చెప్పుకున్నారు. ప్రజల నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ స్వయంగా అర్జీలు తీసుకున్నారు. విజయవంతంగా మొదటి రోజు ప్రజాదర్బార్‌ను ముగించారు. ప్రతీ శుక్రవారం ప్రజాదర్బార్‌ ఉంటుందని సీఎం రేవంత్‌ తెలిపారు. తొలిరోజు ప్రజాదర్బార్‌ విశేషాలను సీఎం రేవంత్‌ ట్వీట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ‘జనం కష్టాలు వింటూ? కన్నీళ్లు తుడుస్తూ.. తొలి ప్రజా దర్బార్‌ సాగింది. జనం నుండి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుంది!‘ అంటూ సీఎం రేవంత్‌ ట్వీట్‌ చేశారు.