పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం
పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి పండించిన పంటను పంటను కొనుగోళ్లు చేయరా అని ప్రశ్నించారు. మార్కెట్‌కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలు ఎక్కడన్నారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పి దళారుల రాజ్యం తెస్తారా అని నిలదీశారు. బడే భాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం చేస్తుండగా, ఛోటా భాయ్ పాలనలో మాత్రం పత్తి రైతు చిత్తవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో పత్తికి మద్దతు ధరకు మించి రూ.8,257 ఇస్తున్నారని, మరి తెలంగాణలో రేతుకు చెల్లిస్తున్నది కేవలం రూ.5 వేలేనా అని ప్రశ్నించారు. రెండేండ్ల క్రితం పత్తి ధర రూ.10 నుంచి రూ.15 వేలు పలికిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అనర్థం ఏమిటని ఎక్స్ వేదిగా ఫైర్ అయ్యారు.