బాబా సిజ్జికీని హత్యచేసింది తామేనట!

` లారెన్స్‌ గ్యాంగ్‌ ప్రకటన
ముంబయి(జనంసాక్షి): ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది.బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. పలువురు దుండగులు అతడిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో అరెస్టయిన హరియాణాకు చెందిన కర్నైల్‌ సింగ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్‌ కశ్యప్‌ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌(ఒజీలితీవనిఞవ ఃతిబష్ట్రనినీతి)కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడిరచిన విషయం తెలిసిందే.మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు కొన్ని నెలలుగా ప్రణాళికలు రచించారని.. ఆయనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారని తెలిపారు. ఈ హత్య చేసినందుకు గాను నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రూ.50,000 అడ్వాన్స్‌, మారణాయుధాలు ఇచ్చినట్లుగా తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడిరచారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘ఇది ట్రైలర్‌ మాత్రమే.. ముందుంది అసలు సినిమా’ అంటూ నాడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పోస్ట్‌ పెట్టారు. తాజా ఘటన నేపథ్యంలో సల్మాన్‌ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
హత్యతో.. దేశం మొత్తం భయపడుతోంది’: అరవింద్‌ కేజ్రీవాల్‌
బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర, బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఎక్స్‌ వేదికగా దిల్లీ మాజీ ముఖ్యమంత్రి , ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు.ఈ హత్యతో మహారాష్ట్ర మాత్రమే కాదు దేశం మొత్తం భయపడుతోందన్నారు. దిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. గ్యాంగ్‌స్టర్‌ పాలన తీసుకురావాలనుకునేవారికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.శనివారం సాయంత్రం ముంబయిలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. బాబా సిద్ధిఖీపై ముగ్గురు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. చాలా కాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన సిద్ధిఖీ కొన్ని నెలల క్రితమే ఎన్సీపీలో చేరారు.

తాజావార్తలు