భారీ దాడికి హమాస్‌ ప్రణాళికలు

` వాషింగ్టన్‌ పోస్టు కథనం
న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ దళం గత అక్టోబర్‌ 7 నాటి దాడికి ముందు 9/11తరహా భారీ దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా పత్రిక వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రచురించింది. ఈ దాడి కుట్రకు సంబంధించిన రికార్డులను ఖాన్‌ యూనిస్‌లోని హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాలు రెండేళ్లుగా వరుసగా జరిపిన సమావేశాల మినిట్స్‌లో ఈ ప్లాన్లు పొందుపర్చి ఉన్నాయి. ఈ మేరకు ఇరాన్‌ అధికారులతో హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ సంభాషణలను కూడా గుర్తించారు. వీటిని ఐడీఎఫ్‌ బలగాలు వాషింగ్టన్‌ పోస్టు, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పత్రికలకు అందజేశాయి. శనివారం న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పది సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను పబ్లిష్‌ చేసింది.సిన్వార్‌తోపాటుతో పాటు అతడి సోదరుడు, మహమ్మద్‌ డెయిఫ్‌, మార్వన్‌ ఇస్సా ఈ సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడులకు రైల్వేలు, బోట్లు, గుర్రపు బగ్గీలను వినియోగించాలని వారు ప్లాన్‌ చేశారు.2021లో అలీ ఖమేనీ సహా ఇరాన్‌ కీలక నాయకులను సిన్వార్‌ కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అదనపు ఆర్థిక మద్దతుతోపాటు.. సైనిక సాయం కూడా కోరినట్లు సమాచారం. ఖుద్స్‌ చీఫ్‌ ఇస్మాయిలీ ఖానీతో అతడు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.హామస్‌ వద్ద ఇజ్రాయెల్‌లోని కీలక ప్రదేశాలకు చెందిన భారీ డేటాబేస్‌ ఉన్నట్లు బయటపడిరది. దీనిలో సుమారు 17,000 ఫొటోలున్నాయి. వీటిని డ్రోన్లు, శాటిలైట్లు తీసినట్లు తెలుస్తోంది. వీటిలో కొన్నింటిని సామాజిక మాధ్యమాల నుంచి సేకరించినట్లు సమాచారం. ఇక టెల్‌అవీవ్‌లోని 68 అంతస్తుల భవనం ‘మోషె అవివ్‌’, అజ్రాయిల్‌ టవర్‌పై దాడులు చేసి నేలమట్టం చేయాలని కుట్రలు పన్నాయి.

తాజావార్తలు