తండ్రి మందలించాడనే కారణంతో పురుగుల మందు తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌: చిట్యాల మండలంలోని బావుసింగ్‌పల్లె గ్రామానికి చెందిన తోటకూర స్రవంతి అనే డిగ్రీ విద్యార్థిని ఆమె తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్థాపానకి గురైన ఆమె పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించి స్థానికులు స్రవంతిని చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినది.