తాగునీటి ఎద్దడి నివరణకు గ్రామస్థుల ఆందోళన

చిన్నచింతకుంట: మండలంలోని ఉండ్యాల గ్రామంలో తాగునీటి ఎద్దటి నివారించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోలకు అంతరాయం కలిగించారు. సమస్య తీవ్రత చాలా రోజులగా ఉన్నా అధికారులు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.