తాటిపూడి నీటి విడుదలపై సమావేశం

విజయనగరం, ఆగస్టు 3 : తాటిపూడి నీటిని ఇతర అవసరాలకు తరలించడాన్ని ఆయకట్టు రైతులు నిరసిస్తున్నారు. పార్టీలకతీతంగా కలిసి పోరాడేందుకు జామి మండలంలోని పది గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారన్నారు. జామి కొత్తలివారి కోవెలలో జామి, అప్పన్న పాలెం, విజినిగిరి, తానవరం, జన్నివలస, వెంకటరాజుపాలెం, శాసనాపల్లి, వెన్నుపాడు, సోమయాజుల పాలెం తదితర గ్రామా రైతులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి బండారు పెదబాబు, కొత్తలి రాథాకృష్ణ, గొర్రిపాటి బాలకృష్ణ, న్యాయవాధి వేచలపు సత్యనారాయణ, వివిధ గ్రామస్తులు తదితరులు నాయకత్వం వహించారు.