తెలంగాణవాదుల అరెస్టు

 

ఇల్లందు : తెలంగాణ మార్చ్‌ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్న సీపీఐ నేతలను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లందు పట్టణం నెం.2 బస్తీలో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలిసులు దాడులు నిర్వహించి అరుగురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టులను స్థానికులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.