తెలంగాణా సమస్య అత్యంత క్షిష్టమైంది: ఆజాద్‌

శ్రీనగర్‌: తెలంగాణ సమస్య అత్యంత క్లిష్టమైందని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. 40,50 ఏళ్లుగా నానుతోన్న ఈ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు విఫలమవుతున్నాయి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్చటానికి ప్రయత్నిస్తున్నాం . మూడు ప్రాంతాల ఆమోదం లభించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లను విభజించినప్పుడు ఎలాంటి వ్యతిరేకత రాలేదని చెప్పారు.